వ్యాక్సిన్ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్.. ఒక్క డోసుతోనే క‌రోనా ఖ‌తం?

September 24, 2020 at 10:20 am

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా 9 ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మూడు కోట్ల మందికి పైగా ఈ వైర‌స్ సోకింది. అయితే క‌రోనాను అడ్డుకోవాలంటే.. ఖ‌చ్చితంగా వ్యాక్సిన్ వ‌చ్చి తీరాల్సిందే.

దీంతో క‌రోనాను అంతం చేసే వ్యాక్సిన్ క‌నుగొనేందుకు ప్ర‌పంచ‌దేశాలు పోటీ ప‌డుతున్నారు. అయితే క‌రోనా వ్యాక్సిన్ రేసులో తాజాగా ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ కూడా చేరింది. ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని అంతం చేసే సామర్థ్యం గల వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది ఈ ఫార్మా దిగ్గజం.

మంచి ఫలితం రావాలంటే ఏదైనా టీకాను కనీసం రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేసినట్టు ఆ కంపెనీ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. కాగా, ప్ర‌స్తుతం ఈ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో ఉండగా, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలో మొత్తం 60 వేల మంది వలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

వ్యాక్సిన్ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్.. ఒక్క డోసుతోనే క‌రోనా ఖ‌తం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts