శివగామికి వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన‌ దర్శకేంద్రుడు!

September 15, 2020 at 6:18 pm

రమ్యకృష్ణ.. ఈ పేరు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల మిత్రులు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ర‌మ్య‌కృష్ణ‌.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో సైతం స‌త్తా చాటింది. ఇక ముఖ్యంగా తెలుగులో కె. రాఘంద్రేరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగింద‌ని చెప్పాలి. ఈమె గ్లామ‌రోతో కూడిన పాత్ర‌లోనైనా, సీరియ‌స్ పాత్ర‌లోనైనా అవ‌లీల‌గా ఒదిగిపోగ‌ల‌దు.

ఇక బాహుబ‌లి చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి శివ‌గామిగా వ‌ర‌ల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. నేడు శివ‌గామి 50వ పుట్టిన‌రోజు. క‌రోనా కార‌ణంగా కేవ‌లం కుటుంబ సభ్యుల మ‌ధ్య సింపుల్‌ రమ్యకృష్ణ పుట్టినరోజును జరుపుకోగా.. దానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ఇక రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా ర‌మ్య‌కృష్ణ‌కు వైరైటీగా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. `రోజ్ రోజ్ రోజా పువ్వా నుంచి మమతల తల్లి వరకు, ఎన్ని సంవత్సరాలు గడిచినా మన ప్రయాణం చెక్కుచెదరనంత గొప్పది. మీరు మరిన్ని ఐకానిక్ పాత్రలతో ప్రపంచాన్ని అలరించాలి. నా డియరెస్ట్ అండ్‌ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు` అని ట్వీట్ చేశారు.

 

శివగామికి వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన‌ దర్శకేంద్రుడు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts