మేక‌ప్ లేకుండా కా‌జ‌ల్ ఫొటోషూట్‌.. ఎలా ఉందంటే?

September 15, 2020 at 7:22 am

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడు ప‌దుల వ‌య‌సు దాటినా కూడా ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది ఈ చంద‌మామ‌. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 మ‌రియు హే సినామికా చిత్రాల్లో ఈమె హీరోయిన్‌గా నటింస్తోంది. చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రాబోతున్న ఆచార్య‌ సినిమాలో కూడా ఈమె హీరోయిన్.

Kajal Aggarwal shares no makeup photos showing her freckles, says 'true  beauty lies, in accepting ourselves for how lovely we are' - bollywood -  Hindustan Times

అలాగే మంచు విష్ణుతో మోసగాళ్లు చేస్తున్న కాజల్ అగర్వాల్.. మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసిందని టాక్. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ప్ర‌ముఖ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన కాజ‌ల్ కొన్ని విష‌యాలు షేర్ చేసుకుంది. మేకప్‌ ద్వారానే ముఖానికి అందం వస్తుందని కొందరు భావిస్తున్నారు.. మీ దృష్టిలో అందంగా ఉండటం అంటే ఏంటీ? అని ప్ర‌శ్నించ‌గా..

Kajal Agarwal Without Makeup - Top 15 Latest Real Life Pictures

`అందం అంటే మేకప్‌ అనే భ్రమలోకి వచ్చేశారు చాలా మంది. దీన్ని తొలగించడానికే నేనే మేకప్‌ లేకండా ఒక ఫొటో షూట్‌ చేశా. వాటిని సోష‌ల్ మీడియా పోస్ట్ చేశా. సోష‌ల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక చాలామంది ముస్తాబై ఫొటోలు తీసుకోవడం, పోస్ట్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందం అంటే మనలా మనం కనిపిస్తూనే, ఆత్మవిశ్వాసంతో మెలగడమన్నదే నా నమ్మకం` అని కాజ‌ల్ చెప్పుకొచ్చింది. కాగా, ఎన్నో సార్లు మేక‌ప్ లేకుండా కా‌జ‌ల్ ఫొటోషూట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

మేక‌ప్ లేకుండా కా‌జ‌ల్ ఫొటోషూట్‌.. ఎలా ఉందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts