బాలీవుడ్ కాదు టాలీవుడ్‌దే నెం.1 స్థానం.. కంగనా హాట్ కామెంట్స్‌!

September 19, 2020 at 2:22 pm

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై మాట్లాడుతూ.. సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌కు ఆకాశానికి ఎత్తేసింది కంగ‌నా. ఇండియాలో బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దదని అందరూ అనుకుంటారు కానీ అది తప్పు ఇపుడు టాలీవుడ్ అగ్రస్థానానికి చేరుకుందని కంగనా వ్యాఖ్యానించారు.

అనేక భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయని అన్నారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో హిందీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేసింది. యోగీ ఆదిత్యానాథ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అన్ని భాషల ఇండస్ట్రీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా తయారు చేయాలని సూచించారు. మనమందరం విడిగా ఉండడం వల్ల హాలీవుడ్ లాభపడుతుందని కంగ‌నా చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ కాదు టాలీవుడ్‌దే నెం.1 స్థానం.. కంగనా హాట్ కామెంట్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts