రేపిస్టులను బహిరంగంగా కాల్చండి: కంగన రనౌత్

September 29, 2020 at 4:28 pm

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌ ప్రాంతానికి చెందిన బాధితురాల్ని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా రెండు వారాల పాటు చికిత్సపొందుతూ మృతి చెందింది.

ఈ ఘటన తనను కలచివేసినట్లు కంగన తెలిపారు. దారుణానికి పాల్పడ్డిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ప్రతి సంవత్సరం దేశంలో పెరుగుతున్న రేపిస్టులను కాల్చడం తప్ప వేరే పరిష్కారం అందుబాటులో ఉందా అని ప్రశ్నించారు. ఈ రేపిస్టులను బహిరంగంగా కాల్చండి అని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ఈ సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటని..? రనౌత్ ప్రశ్నించారు.

దేశం నిజంగా సిగ్గుపడే రోజు అమ్మాయిల్ని కాపాడడంలో విఫలం అవుతున్నాం అని రనౌత్ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు నటి రిచా చాధా కూడా హత్రాస్ సామూహిక అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించడానికి అర్హులే. నేరస్థులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

రేపిస్టులను బహిరంగంగా కాల్చండి: కంగన రనౌత్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts