డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టుడు అరెస్ట్‌!

September 20, 2020 at 9:50 am

ప్ర‌స్తుతం ఓవైపు కంటికి క‌నిపించ‌ని క‌రోనాకు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. మ‌రోవైపు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డ్ర‌గ్స్ వ్య‌హారం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ యువ‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య కేసులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌టంతో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు రంగంలోకి దిగి లోతుగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీంతో అన్ని సినీ పరిశ్రమలు డ్రగ్స్ కేసులతో ఇప్పుడు విలవిలలాడుతున్నాయి.

ఇప్ప‌టికే బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తి, రియా సోదరుడు శోవిక్, సుశాంత్ మేనేజర్ తో పాటు ప‌లువురిని అరెస్ట్ చేయ‌గా.. ఇటు శాండల్‌వుడ్‌లో నటి రాగిణి ద్వివేది, సంజనా గల్రానీతో పాటు ప‌లువ‌రు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా కన్నడనాట కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు మ‌రో ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు.

అందులో నటుడు, కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. రెండో వ్యక్తిని అఖీల్ నౌషీల్ గా పోలీసులు గుర్తించారు. మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ వికాశ్ కుమార్ మాట్లాడుతూ.. వీరిద్దరూ కలిసి డ్రగ్స్ సంపాదించిన తరువాత, బైక్ పై వెళుతూ పట్టుబడ్డారని వెల్ల‌డించారు. అలాగే డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందని అన్నారు.

డ్ర‌గ్స్ కేసులో మ‌రో న‌టుడు అరెస్ట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts