బిగ్‌బాస్‌4: టీవీ9 దేవిని ఇర‌కాటంలో పెట్టేసిన‌ కరాటే కళ్యాణి?

September 21, 2020 at 11:28 am

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచే బిగ్ బాస్ సీజ‌న్ 4 రెండో వారంలో క‌రాటె క‌ళ్యాణి ఎలిమేట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ వారం మొత్తం తొమ్మిది మంది నామినేష‌న్స్‌లో ఉండ‌గా.. అందులో క‌ళ్యాణి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే క‌ళ్యాణి వెళ్తూ వెళ్తూనే టీవీ9 యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లిని ఇర‌కాటంలో పెట్టేసింది.

ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎప్పటిలానే హౌజ్ లోనుంచి బయటికి వచ్చే కంటెస్టెంట్‌కు ఇచ్చే టాస్క్‌ను కళ్యాణీకి కూడా ఇచ్చారు. ఒక బోర్డుపై టాప్‌-5, బాటమ్‌-5 బ్లాక్‌లను ఇచ్చి.. కంటెస్టెంట్‌ల ఫొటోలన్నీ టేబుల్‌పై పెట్టారు.

ఆ ఫొటోలను వాటిలో అమర్చాలని, కారణం కూడా చెప్పాలని నాగ్, కళ్యాణికి సూచించారు. అయితే ఈ గేమ్ అనంత‌రం.. క‌ళ్యాణి దేవికి షాక్ ఇచ్చింది.నాగార్జున ఇచ్చిన బిగ్‌బాంబ్‌ని దేవీ నాగవల్లిపై వేశారు. ఇంతకీ ఆ బాంబ్ ఏంటంటే.. మూడో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేయడం. దీంతో మూడో వారం నామినేషన్స్‌లో దేవి అప్పుడే చేరిపోయారు.

బిగ్‌బాస్‌4: టీవీ9 దేవిని ఇర‌కాటంలో పెట్టేసిన‌ కరాటే కళ్యాణి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts