కష్టకాలంలో ఇలా చేస్తారా..? ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ధర్నా.!

September 30, 2020 at 3:50 pm

ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎంతగానో కుదేలైన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా కొంతమంది ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోలేక పోతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు క్యాబ్ ల నిర్వాహకులు ధర్నా చేపట్టారు. అధికారుల తీరును తప్పుబడుతూ నినాదాలు చేశారు.

తమను ఇబ్బందులకు గురి చేయకండి అంటూ వేడుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు క్యాబులపై ప్రస్తుతం ప్రభుత్వం వసూలు చేస్తున్న పనులను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని ముట్టడించారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు క్యాబ్ లా నిర్వాహకులు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా తీవ్ర నష్టాలపాలయ్యాము అంటూ తెలిపిన వారు.. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం క్వార్టర్లి ట్యాక్స్ ను రద్దు చేయాలి అంటూ కోరారు.

కష్టకాలంలో ఇలా చేస్తారా..? ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ధర్నా.!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts