క‌విత‌క్క‌పై ఎన్ఆర్ఐల ప్ర‌శంస‌‌లు..

September 18, 2020 at 11:08 am

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై ఎన్ ఆర్ఐలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అస‌లు విష‌య‌మేమింటే ఆధార్ లేని కార‌ణంగా ప‌లువురు ఎన్నారైలు త‌మ భూముల‌ను కోల్పోతున్న ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. ఈ నేప‌థ్యంలోనే వారి భూములను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల‌ని, ఎన్నారైలకు భూమి ఉండి ఆధార్‌లేకుంటే పాస్‌పోర్ట్‌ లాంటి ఏదైనా రుజువు పత్రం తీసుకొని, వాటిని ధరణిలోకి ఎక్కించే ప్రయత్నం చేయాల‌ని ఎన్ ఆర్ ఐలు ఎప్ప‌టి నుంచో కోరుతున్నారు. ఈ విష‌య‌మై 27 ఏప్రిల్ 2018 లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను నేరుగా క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు.

ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. ఆధార్‌కార్డు లేని ఎన్నారైల భూముల విషయములో సీఎం కెసిఆర్ గారు మాట్లాడుతూ ఎన్నారై భూములను రక్షిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఎన్ ఆర్ ఐల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. -తమ విజ్ఞప్తి కి స్పందించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ విష‌యంలో త‌మ‌కు క‌వితక్క‌ అన్నివిధాలా అండ‌గా ఉన్నార‌ని, ముఖ్యమంత్రిగారికి విజ్ఞాపణ పత్రం ఇవ్వడంలో ఎంత‌గానో సహకరించార‌ని వారు ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. అందుకే టీఆర్ ఎస్ ఎన్.ఆర్.ఐ కోఅర్డినేటర్ మహెష్ బిగాల, తెరాస న్యూ జిలాండ్ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ బాస్కర్ రెడ్డి కోస్నా, సుధీర్ జలగం ఎన్ ఆర్ ఐలు కవితకు ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపారు.

క‌విత‌క్క‌పై ఎన్ఆర్ఐల ప్ర‌శంస‌‌లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts