ఐపీఎల్ 2020: ముంబై ప్లేయర్ కీరన్‌ పోలార్డ్ స‌రికొత్త‌ రికార్డ్‌!

September 25, 2020 at 7:57 am

ప్రపంచంలో అనేక క్రికెట్ లీగ్ లు ఉన్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఎక్క‌డా లేని క్రేజ్ ఉంటుంది. ఇక ఈ ఏడాది క‌రోనా కార‌ణంగా ఐపీఎల్ 2020 కాస్త ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. ఇదిలా ఉండే.. యూఏఈలో అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో బుధ‌వారం.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్‌తో ముంబై ప్లేయర్ కీరన్‌ పోలార్డ్ స‌రికొత్త‌ రికార్డ్ క్రియేట్ చేశారు. ఒకే టీమ్ తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ టీ20 లీగ్‌ ప్రారంభమైన నాటి నుంచి పోలార్డ్‌ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ టీమ్ సాధించిన ఎన్నో విజయాల్లో పోలార్డ్ కీలక పాత్ర పోషించాడు అన‌డంలో సందేహ‌మే లేదు.

ఇక చాలామంది జట్టులో ప్లేస్ కోసం ఆశగా చూసే ఐపీఎల్ లో ఒకే జట్టుకు సేవలు అందిస్తూ రాణించటంపై ముంబై కెప్టెన్‌ రోహిత్‌.. పోలార్డ్‌ను ప్రశసించాడు. అలాగే ఈ జట్టులోని మరో ప్లేయర్ హార్దిక్‌ పాండ్యా సైతం పోలార్డ్‌ను ప్రశంసించాడు. పోలార్డ్‌ను తన బ్రదర్ లాాంటా వాడని చెప్పుకొచ్చిన పాండ్య.. ముంబై తరఫున పోలార్డ్‌ 200 మ్యాచ్‌లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2020: ముంబై ప్లేయర్ కీరన్‌ పోలార్డ్ స‌రికొత్త‌ రికార్డ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts