చంద్రబాబు అందులో మాస్టర్… తప్పించుకోవచ్చు…

September 16, 2020 at 2:10 pm

అమరావతిలో జరిగిన భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో పలువురు టీడీపీ నేతలు పేర్లు కూడా బయటకొచ్చాయి. ఈ క్రమంలోనే దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… సీఎం ఆదేశాలతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిందని, చంద్రబాబు, అతని బినామీలు లాయర్లకు కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించి.. కోర్టులో వారి పేర్లు బయటకు రాకుండా స్టేలు తెచ్చుకున్నారని ఫైర్ అయ్యారు.

అయితే చంద్రబాబు అవినీతి చేసి డబ్బు ఎలా సంపాదించాలో తెలిసిన మాస్టర్ అని, ఆయన ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. బాబు ఇప్పుడు ఇంట్లో ఉంటూ జైలు జీవితం గడుపుతున్నారని,  బాబు కోర్టుల నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ప్రజల నుంచి శిక్ష తప్పదని మాట్లాడారు.

తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని చెప్తున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కుంభకోణంపై కేబినెట్ సబ్‌ కమిటీ, సిట్‌ నియమించారని, గత మార్చిలోనే అమరావతి రాజధాని భూ కుంభకోణంపై.. సీబీఐ విచారణకు ఆదేశించాలని కేబినెట్ ఆమోదంతో కేంద్రాన్ని కోరామని, కానీ కరోనా జాప్యం జరిగిందని అన్నారు.

చంద్రబాబు అందులో మాస్టర్… తప్పించుకోవచ్చు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts