మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి..

September 23, 2020 at 3:34 pm

మరోసారి మంత్రి కొడాలి నాని సంచలనానికి తెరలేపారు. సీఎం జగన్ సతీసమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని మాట్లాడుతున్న టీడీపీ, బీజేపీ నేతలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. తాజాగా శ్రీవారి దర్శనానికి వచ్చిన కొడాలి.. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోదీ బజారున పడపడుతున్నారని, ముందు మోదీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయని, శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని, స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు.

సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదని, హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా… చర్చిలో క్రైస్తవుడిలా… మసీదులో సమయంలో నవాబులా ఉంటారని తెలిపారు. వేంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారని, శ్రీవారి దయవల్లే జగన్ సీయం అయ్యారన్నారు. అలాగే డిక్లరేషన్‌పై చర్చ జరగాలని, అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో ఉందో బహిర్గతం చెయ్యాలని కోరారు.

మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts