కొన్నేళ్లుగా సింగిల్ గానే ఉంటున్నా : శృతిహాసన్

September 24, 2020 at 6:53 pm

విలక్షణ నటుడు కమలహాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైన శృతిహాసన్ కేవలం నటనతోనే కాదు తన గొంతుతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు కొన్నేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఎన్నో సినిమాల్లో తన గొంతుతో అలరించింది. ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే గత కొంత కాలం నుంచి శృతిహాసన్ చిత్ర పరిశ్రమకు దూరమైన విషయం తెలిసిందే.

అయితే ఇటీవలే తనకు ఒంటరి జీవితమే ఎంతో ఇష్టం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శృతిహాసన్. తాను ప్రస్తుతం కుటుంబంతో విడిగా చెన్నైలో సింగల్ గానే ఉంటున్నాను అంటూ తెలిపిన శృతిహాసన్… తన ఇంట్లో తాను తప్ప ఎవరూ ఉండరు అంటూ తెలిపింది . కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు మాత్రమే కలుస్తుంటానని…ఇంట్లో తన పనులు తాను చేసుకుంటానని.. సింగిల్ గానే ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ తెలిపింది.

కొన్నేళ్లుగా సింగిల్ గానే ఉంటున్నా : శృతిహాసన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts