కేటీఆర్ గారూ.. ఇప్పటికైనా బయటికి రండి..?

September 21, 2020 at 7:07 pm

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోతుంది. లోతట్టు ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి… ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆఫీస్ వదిలి నగరంలో ఒక సారి పర్యటిస్తే పరిస్థితి ఎలా ఉందో అన్నది అర్థమవుతుంది అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు అధికారులు ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని.. ఎలాంటి ప్రాణ హాని జరగకుండా తగిన చర్యలు చేపట్టాలి అంటూ కోరారు ఎంపీ రేవంత్ రెడ్డి.

కేటీఆర్ గారూ.. ఇప్పటికైనా బయటికి రండి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts