భువనేశ్వరిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు…

September 23, 2020 at 5:22 pm

గత కొన్ని రోజులుగా అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవడం తీసుకొచ్చిన డిక్లరేషన్‌పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అన్యమతస్తుడు అయిన జగన్ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సిందే అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు డిక్లరేషన్ తీసేయాలని మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలని,  జగన్ ఎప్పుడో హిందువుగా మారారని,  గతంలో స్వరూపానంద.. జగన్ మోహన్ రెడ్డిని తీసుకొని గంగా నదిలో పూజలు చేయించారని, గంగా నదిలో మూడు మునకలు మునిగి  హిందువుగా మారారని చెప్పారు.

టీటీడీ విషయంలో బీజేపీ, టీడీపీ  నేతలు అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, హిందూ సంప్రదాయం చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలని ఆనంరు. ముఖ్యమంత్రికి డిక్లరేషన్ వర్తిస్తుందా? సోనియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా ?చంద్రబాబు ఎప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు?  కాషాయం వేసిన మూర్ఖులు అంతా ఒక చోట చేరారని ఫైర్ అయ్యారు.

అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయడం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసిందని, భువనేశ్వరి.. లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలని అన్నారు.

భువనేశ్వరిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts