పురాతనమైన కోటలో నాని `శ్యామ్ సింగ రాయ్’.. అదే హైలైట్‌?

September 28, 2020 at 10:14 am

న్యాచుర‌ల్ స్టార్ నాని టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. నాని హీరోగా నటిస్తున్న 27వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ ఫిల్మ్ మేకర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టైటిల్ తోనే ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు మేక‌ర్స్‌.

ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం ఒక పురాతనమైన కోటలోనే ఎక్కువ భాగం నడుస్తోందట‌. మూవీ నేపథ్యంలో.. నాని క్యారెక్టర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

అందుకే నాని ఈ సినిమా పై బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్ పైకి తీసుకువెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న మ‌రోసారి సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి దీనిపై త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ రానుంది. మ‌రోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కూడా నాని లైన్‌లో పెట్టారు. దీనికి ‘టక్ జగదీశ్’ అనే టైటిల్ ఖరారు అయిన సంగ‌తి తెలిసిందే.

పురాతనమైన కోటలో నాని `శ్యామ్ సింగ రాయ్’.. అదే హైలైట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts