హైదరాబాదులో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం…!

September 25, 2020 at 7:29 pm

హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా కావడానికి సిద్ధమైంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. హైదరాబాద్ నగర వాసులు ఇందు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని అలాగే మొదలగు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని రోడ్ నెంబర్ 45 కలుపుతూ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా జరిగింది. ఆసియా ఖండంలోని అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి లో రెండో స్థానంగా ఈ వంతెన నిర్మించబడింది. ప్రభుత్వం ఈ ఫ్లై ఓవర్ కు పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్ వేగా ప్రభుత్వం నామకరణం చేసింది.

ఇక ఈ రెండింటిని పూర్తి చేయడానికి ముందుగా రూ. 150 కోట్లతో రోడ్ నెంబర్ 45 లో వంతెన పనులు పూర్తి చేయగా, రూ .184 కోట్లతో దుర్గం చెరువు పై బ్రిడ్జి ని నిర్మించారు. ఇకపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు నుంచి ప్రజలు సిగ్నల్ లాంటి సమస్యలకు ఎదురుకోకుండా ప్రయాణం కొనసాగించవచ్చు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి ఐటీ కారిడార్ కు అతి సులువైన ప్రయాణానికి అవకాశం కల్పించేలా వీటిని నిర్మించారు.

హైదరాబాదులో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts