ట్రంప్‌కు విషం పూసిన లేఖ.. చివ‌ర‌కు ఏం జ‌రిగిదంటే?

September 20, 2020 at 10:50 am

అమెరికాలో త్వ‌ర‌లోనే అధ్యక్ష ఎన్నికలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అధ్య‌క్ష పదవిలో ఉన్న వారు తమ నిర్ణయాలతో ప్రపంచంలోని కొన్ని దేశాల గతిని మార్చేయగలరు. దీంతో శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ న‌డుస్తోంది. అయితే ఇలాంటి త‌రుణంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రమాదకరమైన పార్శిల్‌ ఒకటి డొనాల్డ్ ట్రంప్ పేరిట వాషింగ్టన్ లోని శ్వేతసౌధం చిరునామాతో రావడం తీవ్ర కలకలాన్ని రేపింది.

అయితే పార్శిల్ స్క్రీనింగ్ సమయంలో అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పార్శిల్‌లోని పదార్థాలను ప్రాథమికంగా పరిశీలించగా అందులో అత్యంత ప్రమాదకరమైన రిసిన్ విషం పూసిన లేఖ ఉన్నట్టు ముందే గుర్తించ‌డంతో.. తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.‌ ప్ర‌స్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.

ఈ పార్సిల్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి.. ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. కెనడా నుంచి ఈ పార్సిల్ వచ్చినట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కాగా, ఈ లేఖపై పూసిన రిసిన్, అత్యంత ప్రమాదకరమైన విషం. దీన్ని జీవాయుధంగా కూడా వినియోగించవచ్చు. దీన్ని తీసుకున్న 36 నుంచి 72 గంటల్లోగా మరణం తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్‌కు విషం పూసిన లేఖ.. చివ‌ర‌కు ఏం జ‌రిగిదంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts