పాల‌వ్యానులో మ‌ద్యం బాటిళ్లు..!

September 26, 2020 at 7:18 pm

ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణలో తక్కువగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. మ‌ద్యం దారులు వివిధ వ‌క్ర‌మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. రోజుకో తీరుగా అక్ర‌మంగా మ‌ద్యాన్ని దొంగ చాటుగా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం రవాణా పోలీసులే ఆశ్చర్యపడేలా సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. ఇప్ప‌టికే చేపలు తరలించే వ్యాన్లో, అంబులెన్స్‌లో, బియ్యం బస్తాలు, ఖాళీ గ్యాస్ సిలిండర్లు, ఒంటికి ప్లాస్టర్లు అంటించుకుని మద్యం తరలిస్తూ పట్టుబడిన సంఘటనలు అనేకం వెలుగు చూశాయి. మ‌ద్యం దారుల వేషాల‌ను చూసి పోలీసులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడు మ‌ద్యం అక్ర‌మ స‌ర‌ఫ‌రా దారులు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసుల తనిఖీల్లో ఈ బాగోతం బట్ట‌బ‌య‌లైంది. పాల వ్యాన్ లో మద్యం తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి ఉయ్యూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాల వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ మద్యం రవాణా ఏపీ పోలీసులకు తీర‌ని తలనొప్పిగా మారింది. ఎంత నిఘా ఉంచినా అక్ర‌మ సరఫరా కొన‌సాగుతుండ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అధికారుల కల్లుగప్పి ఇంకా భారీగానే మ‌ద్యం అక్రమంగా తెలంగాణ నుంచి ఏపీకి వ‌స్తున్న‌ద‌నే అభిప్రాయం రాష్ట్ర ప్ర‌జ‌ల్లో స‌ర్వ‌త్రా వ్యక్తమవుతోంది.

పాల‌వ్యానులో మ‌ద్యం బాటిళ్లు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts