సెప్టెంబర్ 25 నుంచి మరో లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!

September 15, 2020 at 8:55 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసే స‌రైన వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవడంతో.. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇక ముఖ్యంగా అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక‌.. క‌రోనా మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.

భార‌త్‌లో సైతం క‌రోనా పాజిటివ్ కేసులు యాబై ల‌క్ష‌ల‌కు చేరువ అవుతోంది. అయితే ఇలాంటి త‌రుణంలో.. క‌రోనాను అదుపు చేసేందుకు ఈ నెల 25 నుంచి మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ ను కేంద్రం ప్రకటించనుందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ నెల 10న ఈ ఆర్డర్ ను ప్రభుత్వం జారీ చేసినట్టుగా ఉన్న స్క్రీన్ షాట్ వైరల్ అయింది.

ఇందులో ఎన్డీఎంఏ సిఫార్సుల మేరకు ప్రధాని కార్యాలయం మరో సారి లాక్ డౌన్ కు ఆదేశాలు ఇచ్చిందని, 25 నుంచి 46 రోజుల పాటు ఇది కొనసాగుతుందని ఇందులో ఉంది. అయితే తాజాగా దీనిపై భారత అధికార వార్తా సంస్థ పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందిస్తూ.. ఇది తప్పుడు సమాచారమని క్లారిటీ ఇచ్చింది. లాక్ డౌన్ మరోమారు విధించాలంటూ కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేద‌ని.. తేల్చి చెప్పింది.

సెప్టెంబర్ 25 నుంచి మరో లాక్ డౌన్.. క్లారిటీ ఇచ్చిన పీఐబీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts