ఏఆర్‌ రెహమాన్‌కు హైకోర్టు నోటీసులు.. ఏం జ‌రిగిందంటే?

September 11, 2020 at 3:58 pm

అస్కార్‌ అవార్డు విజేత, బహుభాషా సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే తాజాగా ఈయ‌న చిక్కుల్లో ప‌డ్డారు. ఏఆర్ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖకు పన్ను ఎగవేత కేసులో ఆయనకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఏ ఆర్ రెహమాన్ ఫౌండేషన్ .. రెహమాన్ కు సంబంధించిన ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన మూడు కోట్లకు పైగా ఆదాయాన్ని పన్ను ఎగవేత ద్వారా సంపాదించారని ఆదాయపు పన్ను శాఖ కేసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్ర‌మంలోనే ఆదాయపన్ను శాఖ అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాలని ఏఆర్‌ రెహమాన్ ను న్యాయస్థానం ఆదేశించింది.

కాగా, ఇంగ్లండ్‌కి చెందిన ప్రముఖ కంపెనీ నుంచి తీసుకున్న 3.47కోట్లకు సంబంధించి రెహమాన్ ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. ఈ మేరకు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మ‌రి మద్రాసు కోర్టు నోటీసు పై ఏ ఆర్ రెహమాన్ ఏం సమాధానం ఇస్తారో తెలియాల్సి ఉంది.

ఏఆర్‌ రెహమాన్‌కు హైకోర్టు నోటీసులు.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts