సిద్ధార్థ్ ఈజ్ బ్యాక్.. స‌మంత ఔట్‌?

September 18, 2020 at 1:09 pm

తెలుగులో లవర్‌ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్‌.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోయిన సిద్ధార్థ్.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాలే చేయ‌డం లేదు. ఎప్పుడో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన బాద్‌షా చిత్రంలో మెరిసిన సిద్ధార్థ్.. ఆ త‌ర్వాత డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను ప‌ల‌క‌రిస్తున్నారు.

అయితే దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ‌సిద్దార్థ్ తెలుగులో ఒక డైరెక్ట్ చిత్రం చెయ్యడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. ఆర్.ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన‌ అజయ్ భూపతి.. మెద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ కొట్టి త‌న ట్యాలెంట్‌ను నిరూపించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న తన రెండో సినిమాను శర్వానంద్ హీరోగా `మహాసముద్రం`ను త్వరలో పట్టాలెక్కించబోతున్నాడు.

అయితే ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో సిద్ధార్థ్ న‌టించ‌నున్నాడ‌ని చిత్ర యూనిట్ తాజాగా ప్ర‌క‌టించింది. ఇక మ‌రోవైపు ఈ సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆమెను సంప్ర‌దించ‌గా.. అందుకు ఆమెకు కూడా అంగీకరించింన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆ త‌ర్వాత ఆమె సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టు టాక్‌. దీంతో ఆమె ప్లేస్‌లో ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

సిద్ధార్థ్ ఈజ్ బ్యాక్.. స‌మంత ఔట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts