పాన్ బ్రోకర్‌గా మ‌హేష్ బాబు?

September 3, 2020 at 2:16 pm

ఇటీవ‌ల `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ప్ర‌స్తుతం గీతా గోవిందం ఫేం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ప్రీ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.

ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఆర్థిక నేరాలకు వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా వ్యాపారవేత్త దగ్గర నుండి ఆ కోట్ల డబ్బును ఎలా తిరిగి రాబట్టాడనే ప్రయత్నాలను త‌నదైన శైలిలో చూపేందుకు ప‌రుశురామ్ సిద్ధం అయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో మ‌హేష్ బాబు డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారట.

అందులో ఒక‌టి పాన్ బ్రోకర్ పాత్ర కాగా.. మ‌రొక‌టి బ్యాంక్ ఆఫీసర్ పాత్ర‌లో మహేష్ నటించబోతున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది మ‌రికొన్ని రోజుల్లో తెల‌నుంది. కాగా, ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

పాన్ బ్రోకర్‌గా మ‌హేష్ బాబు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts