సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ ప్లాప్ మూవీ!

September 4, 2020 at 8:46 am

ఒక్కోసారి థియేట‌ర్‌లో హిట్ కాని సినిమాలు.. యూట్యూబ్‌లో పెడితే అదిరిపోయేలా హిట్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా మ‌హేష్ బాబు ప్లామ్ మూవీ యూట్యూబ్‌లో సెన్సేష‌న‌ల్ రికార్డు క్రియేట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం `ఆగడు`.

14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో త‌మన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఇక‌ భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఇపుడు ఇదే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ మాత్రం యూట్యూబ్ లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది.

హిందీ డబ్బింగ్ లో విడుదల చేయబడ్డ అన్ని వెర్షన్ల తాలూకా వ్యూస్ అన్ని కలిపితే ఈ చిత్రం 500 మిలియన్ వ్యూస్ వచ్చి పడ్డాయి. ఏదేమైనా ఇండియన్ సినిమాలో అందులోను ఒక ప్లాప్ సినిమా ఈ మార్క్ ను ట‌చ్ చేయ‌డం ఇదే మొద‌టిసార‌ని చెప్పాలి.

సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ ప్లాప్ మూవీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts