`సర్కారు వారి పాట` సగం అక్కడేన‌ట‌.. జోరు పెంచిన మ‌హేష్‌?

September 26, 2020 at 8:49 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లతో కలిసి మహేష్ బాబు స్యయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని ఇప్ప‌టికే ప్ర‌చారం జ‌రిగింది.

ఇక క‌రోనా కారణంగా సినిమా మొదలవడం కాస్త ఆలస్యమైంది. కానీ, చిత్ర టీమ్ త్వరలో షూట్ మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. మేకర్స్ యూఎస్ లో లొకేషన్స్ వేటలో ఉన్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రం షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం అవ్వ‌నుంది. తాజాగా ఈ సినిమా గురించి మ‌రో అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కథ ప్రకారం సినిమా అమెరికా నేపథ్యంలో కూడ జరుగుతుందట.

అంతేకాదు, సినిమా స‌గం షూటింగ్‌ అక్కడే ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. అలాగే మ‌హేష్‌ ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చెయ్యాలని భావిస్తున్నారట. షూట్ మొదలు కాబడిన ఈ రెండు మూడు నెలలోనే సగానికి పైగా షూట్ ను పూర్తి చేయాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఇందులో మహేష్ జోడీగా కీర్తి సురేష్ నటింస్తుందనే వార్తలు వస్తున్నా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. త్వ‌ర‌లోనే దీనిపై కూడా ఓ క్లారిటీ రానుంది.

`సర్కారు వారి పాట` సగం అక్కడేన‌ట‌.. జోరు పెంచిన మ‌హేష్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts