మ‌హేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందిగా‌.. వైర‌ల్ ఫొటో!

September 10, 2020 at 8:12 am

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దాదాపు ఏడెనిమిది నెలల విరామం తర్వాత మ‌హేష్ మ‌ళ్లీ మేకప్‌ వేసుకున్నారు.

అయితే, ఆయన సినిమా కోసం కాదు.. ఒక వాణిజ్య ప్రకటన కోసం. బుధవారం హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో ఈ యాడ్‌ షూటింగ్‌ జరిగింది. రెండు మూడు రోజుల్లో ఇది పూర్తి కానుంది. దీనికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వచ్చాడు సూపర్ స్టార్. ఇక ఈ యాడ్ ను నేషనల్ లెవెల్ యాడ్ ఫిలింమేకర్ అవినాశ్ గోవారికర్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా షూట్ ముగిసిన అనంత‌రం గోవారికర్ మహేష్‌ బాబును స్టిల్స్‌ తీశారు. వాటిలో కళ్లుచెదిరే రీతిలో స్టన్నింగ్స్ లుక్స్ తో ఉన్న ఒక ఫొటోను గోవారికర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, పెంచిన జుట్టుతో మహేష్‌ లుక్ అదిరిపోయింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. అంతేకాదు, స‌ర్కారు వారి పాట సినిమా లుక్‌ ఇదే అని ప్రచారం కూడా ఊపందుకుంది.

Image

మ‌హేష్ బాబు కొత్త లుక్ అదిరిపోయిందిగా‌.. వైర‌ల్ ఫొటో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts