అతిపెద్ద స్కామ్ చేయ‌బోతున్న కాజ‌ల్, మంచు విష్ణు!

September 18, 2020 at 2:11 pm

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు విష్ణు వ‌రుస ఫ్లాపుల‌తో సత‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న `మోసగాళ్లు` అనే సినిమా చేస్తున్నాడు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. విష్ణుకు చెల్లిగా న‌టిస్తుండ‌డం విశేషం.

Manchu Vishnu's film is 'Mosagallu' -

అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్‌ను హీరో ద‌గ్గుబాటి వెంక‌టేష్ లాంచ్ చేశారు. ఇందులో అర్జున్ పాత్రలో నటిస్తున్నాడు విష్ణు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇక విష్ణు, కాజల్‌‌ బ్రదర్‌ అండ్‌ సిస్టర్ న‌టిస్తుండ‌డంతో.. వీరిద్ద‌రి పాత్రలు ఎలా ఉండ‌బోతున్నాయి అన్న‌దానిపై ఆస‌క్తి నెల‌కొంది.

Vishnu Manchu and Kajal Aggarwal to play siblings in Mosagallu | Telugu  Movie News - Times of India

కాగా, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అయింది. ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ స్టార్ట్‌ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే రీస్టార్ట్‌ కానుంది. మ‌రి కాజ‌ల్‌తో స్కామ్ చేయ‌బోతున్న విష్ణు.. హిట్ కొడ‌తాడో లేదో చూడాలి.

 

అతిపెద్ద స్కామ్ చేయ‌బోతున్న కాజ‌ల్, మంచు విష్ణు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts