మరో కేంద్ర మంత్రి కరోనా..!

September 17, 2020 at 5:09 pm

ప్రస్తుతం వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 25 మందికి పైగా పార్లమెంటు సభ్యులు కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేవలం పార్లమెంట్ సభ్యులు మాత్రమే కాదు పార్లమెంట్ సిబ్బంది కి కూడా 50 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రతిరోజు సభ్యులందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే స్వయంగా ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్ అని వచ్చింది అని గత కొన్ని రోజుల నుంచి తనకు సన్నిహితంగా ఉన్న వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కరోనా నిర్ధారిత పరీక్షలు చేసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఆయన కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.

మరో కేంద్ర మంత్రి కరోనా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts