మరో మంత్రి కి పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు..?

September 25, 2020 at 3:16 pm

మహారాష్ట్రలో రోజురోజుకు కరోనా వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. సామాన్య ప్రజల పైనే కాదు ప్రజాప్రతినిధుల పైన కూడా శరవేగంగా పంజా విసురుతు ఎంతోమందిని మృత్యువుతో పోరాడేలా చేస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ పరిస్థితులు చక్క పడే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇటీవలే మరో మంత్రి కరోనా వైరస్ బారిన పడ్డారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే కరోనా లక్షణాలు ఉండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది.

కాగా మహారాష్ట్ర క్యాబినెట్ లో మొత్తంగా 13 మంది మంత్రులు కరోనా వైరస్ బారిన పడటం కలకలం సృష్టిస్తోంది. అయితే మూడు రోజుల కిందటే ఏక్నాథ్ క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ వెంటనే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి అంటూ సూచించారు. కాగా ప్రస్తుతం పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

మరో మంత్రి కి పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts