మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న టీవీ స్టార్..?

September 30, 2020 at 4:03 pm

మొగలిరేకులు సినిమాతో బుల్లితెరపై స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సాగర్. ఆ తర్వాత పలు సీరియల్స్ లో అందరినీ ఆకట్టుకున్నారు. బుల్లితెరపై కూడా పలు కీలక పాత్రల్లో నటించిన సాగర్ ఆ తరువాత ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు సినిమాలతో లక్కు పరీక్షించుకోవడానికి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాగర్. కానీ సాగర్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

అయినప్పటికీ వెనకడుగు వేయకుండా తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మరోసారి తన లక్ ను పరీక్షించుకునేందుకు నిర్ణయించుకున్నాడు సాగర్. ప్రస్తుతం షాదీ ముబారక్ అనే సినిమాలు సాగర్ నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. కాగా ప్రస్తుతం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా మారిపోయింది. సినిమా కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న టీవీ స్టార్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts