మెద‌క్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు..?

September 23, 2020 at 6:57 am

రూ.కోటి పన్నెండు లక్షల లంచం తీసుకుంటూ దొర‌కిపోయిన మెద‌క్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ న‌గేశ్ కేసు విచార‌ణలో కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్‌ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్‌ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అడిషనల్‌ కలెక్టర్‌ తమకు ఫోన్‌ చేసి ఆదేశిస్తేనే తాము ఆ పనులు చేశామని వారు వెల్ల‌డించిన‌ట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి అడిషనల్‌ కలెక్టర్ తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ అబ్దుల్‌ సత్తార్, జూని యర్‌ అసిస్టెంట్‌ మహ్మద్‌ వాసీం, నగేశ్‌ బినామీ జీవన్‌గౌడ్ను ఏసీబీ రెండోరోజులుగా విచారిస్తున‌న‌ది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కొన‌సాగిన విచార‌ణ‌లో ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌యిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇదిలా ఉండ‌గా.. ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న అడిషనల్‌ కలెక్టర్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు ‘నాకు తెలియదు’అనే స‌మాధానమిచ్చిన‌ట్లు అధికార‌వ‌ర్గాలు తెల‌ప‌డం విశేషం. అయితే తన వద్దకు వచ్చిన వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్‌ కలెక్టర్‌ ‌ చాలా జాగ్రత్తగా డీల్‌ చేసేవార‌ని, ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్‌గౌడ్‌ నంబరు ఇచ్చేవార‌ని, ఆ తరువాత మొత్తం వ్య‌వ‌హారాల‌న్నీ అత‌నే చక్కదిద్దేవాడ‌ని, మేడ్చల్‌ వైపు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వద్ద కలుసుకుని అక్కడే లంచం తీసుకునేవాడ‌ని అధికారులు గుర్తించిన‌ట్లు సమాచారం. ఆ ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండడ‌డం, తాను నివాస‌ముంటున్న సికింద్రాబాద్కు స‌మీపం ఉండడం వల్ల జీవ‌న్‌గౌడ్ ఆ రింగురోడ్డునే ఎంచుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది. రెండో రోజు విచారణలో న‌గేశ్ బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. అదేవిధంగా మెదక్, మనోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్‌కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. కలెక్టరేట్ సిబ్బందితో పాటు కిందిస్థాయి ఉద్యోగులను సైతం ఏసీబీ విచారిస్తున్న‌ది. నగేశ్‌ భార్య పేరు మీదున్న బ్యాంక్‌ లాకర్‌ కీ లభ్యం కాకపోవడం తో, సంబంధిత‌‌ అధికారులతో మాట్లాడి మరో డూప్లికేట్‌ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తుండడం గ‌మ‌నార్హం. ఇక ఆ లాకర్‌ తెరిస్తే ఇంకెన్ని విష‌యాలు వెలుగులోకి వ స్తాయో చూడాలి మ‌రి.

మెద‌క్ అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts