క‌రోనా బారిన‌ప‌డ్డ నాగ‌బాబు.. ఆ షోలో టెన్ష‌న్ టెన్ష‌న్‌?

September 15, 2020 at 8:32 am

క‌రోనా వైర‌స్‌.. కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడిచారు. క‌రోనాను అంతం చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. అడ్డు అదుపు లేకుండా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. ఇక సామాన్యులు, సెల‌బ్రెటీలు అనే తేడా లేకుండా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు.

తాజాగా మెగాస్టార్ సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. దగ్గు, జర్వం లక్షణాలు కనిపించడంతో నాగబాబు క‌రోనా టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం నాగబాబు హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం.

ప్ర‌స్తుతం నాగబాబు ఓ ప్రముఖ ఛానల్‌లో ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఓ షో చేస్తున్నాడు. అంతేకాదు తన కుమార్తె నిహారికతో కలిసి ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ కూడా చేసారు నాగబాబు. అయితే ఇప్పుడు నాగ‌బాబుకు క‌రోనా అని వార్త‌లు రావ‌డంతో.. ఆయ‌న షోస్‌లో పాల్గొన్న టీవీ తార‌ల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ట్టు తెలుస్తోంది.

క‌రోనా బారిన‌ప‌డ్డ నాగ‌బాబు.. ఆ షోలో టెన్ష‌న్ టెన్ష‌న్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts