మెట్రో ప్రయాణికులు అలర్ట్.. అలా చేశారో జేబుకు చిల్లే..?

September 22, 2020 at 9:50 am

ప్రస్తుతం పలు నగరాలలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల అందరికీ తప్పనిసరిగా మెట్రో సూచించిన నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ కొంతమంది ప్రయాణికులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక దీని పై దృష్టిసారించిన ఢిల్లీ మెట్రో రైలు అధికారులు.. నిబంధనలను ఉల్లంఘించి మాస్కు ధరించకుండా మెట్రో రైలు ఎక్కిన ప్రయాణికులను గుర్తించారు.

ఏకంగా రెండు వారాల వ్యవధిలో ఇలా మాస్కు ధరించకుండా మెట్రో రైలు ఎక్కి ప్రయాణించిన 2214 మంది ప్రయాణికులను గుర్తించారు… దీంతో వారందరికీ జరిమానాలు విధించినట్లు గా తెలిపారు అధికారులు. రైల్వే ప్రయాణికుల అందరూ తప్పనిసరిగా అధికారులు సూచించిన నియమ నిబంధనలు పాటించాలని.. లేకపోతే భారీ జరిమానాలు తప్పవు అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులందరూ సామాజిక దూరం తో పాటు సరైన నిబంధనలు పాటించేందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశాము అంటూ అధికారులు తెలిపారు.

మెట్రో ప్రయాణికులు అలర్ట్.. అలా చేశారో జేబుకు చిల్లే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts