ఎస్పీ బాలుకు ఏపీ ప్ర‌భుత్వం అరుదైన గౌరవం!

September 27, 2020 at 7:47 am

దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా తన మధురగానంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. గత 40 రోజులుగా మృత్యువుతో పోరాడిన బాలు సెప్టెంబ‌ర్ 25 మ‌ధ్యాహ్నం 1.04 గంట‌ల‌కు తుది శ్వాస విడిచాడు. నిన్న చెన్నై శివారులోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అంతిమ సంస్కారాలు కూడా పూర్తి అయ్యాయి.

ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అశ్రు నివాళులు అర్పించారు. ఇదిలా ఉంటే.. ఎస్పీ బాలుకు గౌరవించుకోవాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ఈ క్ర‌మంలోనే ఎస్పీ బాలు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎస్పీబి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనిల్.. అనంతరం ఎస్పీ కుమారుడు చరణ్‌ను ఓదార్చారు.

అనంత‌రం అనిల్ మాట్లాడుతూ.. ఎస్పీ బాలు నెల్లూరులో పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు.అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు గుర్తుగా నెల్లూరులో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలోనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు.

ఎస్పీ బాలుకు ఏపీ ప్ర‌భుత్వం అరుదైన గౌరవం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts