ఏపీలో క‌రోనా టెర్ర‌ర్‌.. మ‌రో మంత్రికి పాజిటివ్‌!

September 15, 2020 at 9:43 am

క‌రోనా వైర‌స్‌.. ఈ మ‌హ‌మ్మారి పేరు వింటేనే ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన ఈ క‌రోనా వైర‌స్ అన‌తికాలంలోనే ప్ర‌పంద‌చేశాల‌కు పాకేసి.. ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకుంది. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా టెర్ర‌ర్ సృష్టిస్తోంది. ఏపీలో గత కొన్నిరోజుల పాటు నిత్యం 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు వ‌స్తున్నాయి.

ఇక సామాన్య‌లు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు సైతం ఈ క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా ఏపీలో మ‌రో మంత్రికి క‌రోనా సోకింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అవంతితో పాటు ఆయన కుమారుడు శివసాయి సందీప్‌కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

ఈ ఇద్దరు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. ప్ర‌స్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, తనను ఇటీవలి కాలంలో కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని, తమ వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తాను అందరికీ ఫోన్ లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

ఏపీలో క‌రోనా టెర్ర‌ర్‌.. మ‌రో మంత్రికి పాజిటివ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts