నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనున్న ‌హరీష్ రావు!

September 14, 2020 at 9:32 am

తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ఆరవరోజు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే నేటి నుంచి మంత్రి హరీష్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ నెల 5వ తేదీన మంత్రి హరీష్ రావుకి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. ఆయన హోం ఐసోలేష‌న్ ఉన్న విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. హైదరాబాద్‌లోని కోఠి ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో.. హరీష్ రావుకు కోవిడ్ నెగటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యులు స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులను హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.

మ‌రోవైపు ఈ రోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను మండలి ఆమోదం కోసం కేసీఆర్‌ చర్చకు పెట్టనున్నార‌ని స‌మాచారం.

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనున్న ‌హరీష్ రావు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts