అదే నిజమైతే రాజీనామా చేస్తానంటున్న ఏపీ మంత్రి…

September 18, 2020 at 2:49 pm

ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ ఖరీదైన బెంజి కారును మంత్రి జయరాం తనయుడుకు గిఫ్ట్ ఇచ్చారని ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు కూడా చేశారు.

అయితే అయ్యన్న ఆరోపణలపై మంత్రి జయరాం తీవ్రంగా స్పందించారు. బెంజ్ కారు తన కుమారునిది కాదని, వేరే వాళ్ళదని చెప్పరి. వేరే వాళ్ల కారు పక్కన ఫోటో దిగాడని, హెలికాఫ్టర్ దగ్గర, ట్రైన్ దగ్గర ఫోటో తీసుకుంటే మనదే అవుతుందా..? అని ప్రశ్నించారు.

ఇక కారు మాదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, చంద్రబాబుకి, టీడీపీ నాయకులకు మతి భ్రమించిందని, గత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఏవైనా పెద్ద పదవులు ఇచ్చారా..? అని నిలదీసిన ఆయన, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని అన్నారు. అయ్యన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారని, చంద్రబాబు మాయల ఫకీర్ లాంటివారని, ఎవరిని ఏయే శాఖలో నియమించుకోవాలో అక్కడ తన వారిని నియమించుకొని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

అదే నిజమైతే రాజీనామా చేస్తానంటున్న ఏపీ మంత్రి…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts