బూట్లు వేసుకుని పూజలు… ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది..  

September 21, 2020 at 4:02 pm

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఆలయాలను పున:నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన అని వెల్లంపల్లి అన్నారు. సింహాచలం భూములకు సంబంధించిన పంచ గ్రామాల సమస్య పరిష్కారానికి సీఎం కమిటీ వేశారని తెలిపారు.

ఇక బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబుకు హిందువులపై ప్రేమ లేదని.. ఆయన ట్వీట్లు పట్టించుకోవద్దని, భక్తుల మనోభావాలు కాపాడే విధంగా ముందుకెళ్తామన్నారు. కుట్రలతోనే ఆలయాలపై దాడులు జరిగాయని.. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. రాజకీయ కుట్రతో ప్రజలను అయోమయం చేసే ఘటనలు జరిగాయని, అన్యాక్రాంతమైన ఆలయాల భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేవాలయాల్లో చాలా సంప్రదాయాలు ఉంటాయని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఆలయాల భూముల పరిరక్షణకు జగన్‌ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మతాలు, కులాలను సీఎంకు అంటగట్ట వద్దని హితవుపలికారు.

బూట్లు వేసుకుని పూజలు… ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది..  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts