ఎమ్మెల్యే ప్రాణం తీసిన కరోనా రాకాసి..!

September 24, 2020 at 6:17 pm

కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. భయాందోళనలో మునిగిపోతున్న ప్రజలను… ప్రజలకు ధైర్యం చెబుతూ అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధులను.. ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పిస్తున్న అధికారులను ఇలా ఎవరిని వదలడం లేదు. అందరిపై పంజా విసురుతు ప్రాణాలను బలి తీసుకుంటుంది ఈ మహమ్మారి వైరస్. ఇటీవలే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.

కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణరావు… ఇటీవలే కరోనా వైరస్ బారినపడి బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. ఇక ఆయన పై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చికిత్స తీసుకుంటున్నపటికి క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇక చివరికి ఇటీవలే వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు నారాయణరావు. దీంతో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు అందరూ విషాదంలో మునిగిపోయారు. అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే నారాయణరావు మరణవార్త తెలిసి కాసేపు మౌనం పాటించడంతో పాటు సభను వాయిదా వేశారు.

ఎమ్మెల్యే ప్రాణం తీసిన కరోనా రాకాసి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts