ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ సోనూసూద్ ని సాయం కోరిన వ్యక్తి..!

September 17, 2020 at 7:18 pm

కరోనా సంక్షోభం సమయంలో తన పెద్దమనసు చాటుకుంటున్న బాలీవుడ్ నటుడు సోను సూద్ ఎంతో మందికి సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వలస కార్మికులకు ఎంతగానో అండగా నిలిచిన సోనుసూద్ సహాయం కావలి అని కోరిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేందుకు ముందుకు కదులుతున్నాడు. సాయం కోరిన వారికి సహాయం చేసేందుకు ఒక ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇచ్చాడు. అయితే ఇటీవలే సోనూ ని ఓ వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలి అంటూ కోరాడు.

ఇక ఆ వ్యక్తి ఎమ్మెల్యే టికెట్ అడగడం తో ఒక్కసారిగా సోనుసూద్ షాక్ అయ్యాడు. అయితే దీనిపై తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు సోనూ . తనకు ఇప్పటి వరకు బస్సు టిక్కెట్లు బుక్ చేయడం విమాన టిక్కెట్లు బుక్ చేయడం రైలు టిక్కెట్లు బుక్ చేయడం మాత్రమే తెలుసని కానీ ఎమ్మెల్యే టిక్కెట్లు బుక్ చేయడం ఎలాగో తనకు తెలియదు అంటూ… సదరు వ్యక్తికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు సోనూ . అయితే తనకు రాబోయే బీహార్ ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేస్తాను అంటూ సదరు వ్యక్తి రిక్వెస్ట్ చేసాడు.

ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ సోనూసూద్ ని సాయం కోరిన వ్యక్తి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts