బిగ్‌బాస్‌4: కొత్త ట్విస్ట్ ఇచ్చిన‌ మోనాల్.. మండిపోయిన అభిజిత్‌?

September 30, 2020 at 9:53 am

బిగ్ బాస్ సీజ‌న్ 4 ప్ర‌స్తుతం నాల్గువ వారంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మంచి ఫామ్‌లోకి వ‌చ్చిర ఇంటి స‌భ్యులు త‌మ‌దైన శైలిలో గేమ్ ఆడుతున్నారు. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ కూడా త‌న ఆట మొద‌లు పెట్టేసింది. అయితే స్వాతి రావ‌డంతో.. అప్ప‌టి వ‌ర‌కు మోనాల్, హారిక‌ల‌ను ప‌ట్టుకుని ఉన్న అభిజిత్ రూటు మార్చి స్వాతిని త‌గులుకున్నాడు.

ఇక స్వాతి కూడా అభిజిత్‌తోనే ఎక్కువ‌గా టైమ్ స్పెండ్ చేస్తోంది. మ‌రోవైపు అఖిల్ కూడా స్వాతితో పులిహోర క‌లిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే ఇలాంటి త‌రుణంలో మోనాల్ కొత్త ట్విస్ట్ ఇచ్చింది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో నోయల్‌ని వెనుక నుంచి హగ్ చేసుకుంది మోనాల్‌. అంతేకాదు అతడికి తినిపించింది.

దీంతో అభిజిత్‌కు మండిపోయింద‌ని చెప్పాలి. ఆ సమయంలో పక్కనే ఉన్న స్వాతి తరువాతి టాస్క్‌లు ఎలా ఉంటాయో అని అడుగుతున్నా.. అభిజిత్ మాత్రం పట్టించుకోలేదు. చివ‌ర‌కు ఆలోచించాలనిపించడం లేదంటూ చిన్న మాట చెప్పి.. సైలెంట్ అయ్యారు. ఏదేమైనా అఖిల్‌, అభిజిత్‌ల‌కు ప‌క్క‌న పెట్టేందుకు మోనాల్ ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని చెప్పాలి.

బిగ్‌బాస్‌4: కొత్త ట్విస్ట్ ఇచ్చిన‌ మోనాల్.. మండిపోయిన అభిజిత్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts