జగన్ సర్కార్ న‌యా రికార్డ్.. దేశంలోనే నంబర్‌ వన్!

September 25, 2020 at 8:49 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ అటు ప్ర‌జ‌ల‌ను, ఇటు ప్ర‌భుత్వాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడు కోట్లు దాటేయ‌గా.. మ‌ర‌ణాలు ప‌ది ల‌క్ష‌ల‌కు చేరువ అవుతున్నాయి.

ఇక ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే క్ర‌మంలోనే ప్ర‌పంచ‌దేశాలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఇదిలా ఉంటే క‌రోనా విజృంభిస్తున్న వేళ జ‌గ‌న్ స‌ర్కార్ న‌యా రికార్డ్ క్రియేట్ చేశారు. క‌రోనా వైర‌స్ నియంత్రణలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌ వ్యూహంతో ముందుకెళ్తూ.. రాష్ట్ర జనాభాలో 10 శాతం మందికి కరోనా టెస్టులు చేసి రికార్డు సృష్టించింది.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ బయటపడిన రోజు ఒక్క ల్యాబ్ లేకపోయినా గత ఆరు నెలల్లో టెస్టులు చేసే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుని ఏపీ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. అలాగే రోజు రోజుకూ టెస్టుల సంఖ్య పెంచుకుంటూ వచ్చి 10 లక్షలు జనాభాకు లక్షకు పైగా టెస్టులు చేస్తోంది ఏపీ స‌ర్కార్‌. కాగా, ఏపీలో ప్ర‌స్తుతం క‌రోనా కేసుల సంఖ్య 6,54,385కు చేరుకోగా.. అందులో 5,79,474 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య 5558కు చేరింది.

జగన్ సర్కార్ న‌యా రికార్డ్.. దేశంలోనే నంబర్‌ వన్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts