నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు: రఘురామ

September 26, 2020 at 1:57 pm

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కరోనా అంటించే కుట్ర చేస్తున్నారని, క్రిస్టియన్‌ దళితులతో తనపై దాడి చేయించేందుకు కుట్ర పన్నారని ఫైర్ అయ్యారు. హిందువులు మేల్కొనాలి, మతంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలని అన్నారు.

ఏపీలో ఉన్న పోలీసులకు చట్టాలపై అవగాహన లేదని, ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, వైసీపీలోనే కొనసాగుతున్నా… కొత్త పార్టీ పెట్టే ఆలోచనలేదని రఘురామ స్పష్టం చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని.. మరో రెండు, మూడు రోజుల్లో దాడి జరగనుందని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. దాడి చేస్తే ఆవేశపడి ఓ మాట అనే అవకాశం ఉందనే ఆలోచనల్లో వాళ్లు ఉన్నారన్నారు. ఇక తోలు తీస్తా అన్నారని, ఊళ్లోకి రా.. పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టేస్తామని హెచ్చరించిన విషయాలను గుర్తు చేశారు. దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని… ఈ విషయాన్ని తాను పలు సార్లు ప్రస్తావించానన్నారు. అందుకే హిందూ దళిత నాయకులు తన వెంట నిలిచారన్నారు.

 

నాకు కరోనా అంటించాలని చూస్తున్నారు: రఘురామ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts