ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన గౌర‌వం.. బిల్ గేట్స్‌తో కలిసి చ‌ర్చ‌లు!

September 23, 2020 at 11:37 am

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, రాజ్య‌స‌భ్య స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి.. అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు. ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో జ‌ర‌గ‌నున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2020లో పాల్గొనే అవ‌కాశాన్ని విజ‌య‌సాయి రెడ్డి పొందారు.

నేడు (సెప్టెంబర్ 23) ప్రపంచ ప్రఖ్యాత బిల్‌గేట్స్‌తో కలిసి ప్రపంచ వ్యాపార వేదికపై ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, అవకాశాలపై చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌లో బిల్‌గేట్స్‌తో పాటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నెట్ ఫ్లిక్స్ కో సీఈవో టెడ్ శరనడోస్ పాల్గొనున్నారు.

నేటి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ జ‌ర‌గ‌నుంది. ఇండియన్ కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్ పర్సన్‌గా ఈ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో విజ‌య‌సాయి రెడ్డి హాజ‌రుకానున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలియ‌జేస్తూ.. ఆనందాన్ని వ్యాక్తం చేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన గౌర‌వం.. బిల్ గేట్స్‌తో కలిసి చ‌ర్చ‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts