ఐపీఎల్ 2020: చెన్నై ఫ్యాన్స్‌కు ధోనీ గుడ్ న్యూస్‌!

September 26, 2020 at 10:41 am

ఐపీఎల్ 13వ సీజన్ లో నిన్న‌ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ వరుసగా రెండో గెలుపు నమోదు చేయగా, చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. ఢిల్లీ నిర్దేశించిన 176 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై తొలి నుంచే ఆపసోపాలు పడి.. చివ‌ర‌కు ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది.

అయితే వరుస ఓటములపై చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ స్పందించాడు. తొలి మ్యాచ్‌లో ఇరగదీసిన అంబటి రాయుడు జట్టులో లేకపోవడం వల్లే ఓటమి పాలవుతున్నట్టు చెప్పాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు రాయుడు అందుబాటులో ఉంటాడని గుడ్ న్యూస్ చెప్పాడు ధోనీ.

రాయుడు వ‌స్తే అంతా సర్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. రాయుడు కనుక అందుబాటులోకి వస్తే అదనపు బౌలర్‌తో ప్రయోగాలు చేసేందుకు వీలుంటుందని ధోనీ చెప్పుకొచ్చాడు. అలాగే బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం బాధగా ఉందన్నాడు. ఆరంభంలో జోరు తగ్గడంతో బంతులు, పరుగుల మధ్య వ్యత్యాసం పెరిగి ఒత్తిడి పెరుగుతోందన్నాడు.

ఐపీఎల్ 2020: చెన్నై ఫ్యాన్స్‌కు ధోనీ గుడ్ న్యూస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts