రాహుల్ తెవాటియాకు క్షమాపణ చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్..!

September 28, 2020 at 7:17 pm

రాహుల్ తెవాటియా.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శివాలెత్తిన తెవాటియా విండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ బౌలింగులో 5 సిక్సర్లు బాదాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెవాటియా మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 20 బంతులను చెత్తగా ఆడినప్పటికీ తనపై తాను విశ్వాసం కోల్పోలేదన్నాడు. క్రీజులోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకునేందుకు తెవాటియా బాగా కష్టపడ్డాడు. ఆ తర్వాత మాత్రం చెలరేగిపోయాడు.

ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. రాహుల్ తెవాటియాను చాలా తక్కువ అంచనా వేశానని… ఆరంభంలో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ రాహుల్ తెవాటియా తర్వాత రఫ్పాడించాడన్నారు. మొదటగా 20 బంతులు చాలా చెత్తగా ఆడాడని… ఇలాంటి బ్యాటింగ్ ఎప్పుడు చూడలేదని అనుకున్నాను అన్నారు. మ్యాచ్ చేజారడానికి తెవాటియానే కారణమవుతాడని కానీ చివరకు షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో ఓవర్లలో ఐదు సిక్స్‌లు బాది మ్యాచ్‌ ను తెవాటియా చెలరేగిపోయాడని ఆయన ప్రశంసల జల్లు కురిపించాడు.

రాహుల్ తెవాటియాకు క్షమాపణ చెప్పిన ఎమ్మెస్కే ప్రసాద్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts