పబ్ జీపై ముఖేష్ అంబానీ కన్ను.. మ‌ళ్లీ ఇండియాలోకి రీ ఎంట్రీ?

September 26, 2020 at 11:54 am

భారత్-చైనా ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో.. భార‌త్ ప్ర‌భుత్వం చైనాను గ‌ట్టి దెబ్బ కొట్టింది. దేశ భ‌ద్ర‌త దృష్ట్యా కేంద్ర‌ప్ర‌భుత్వం కొద్దిరోజుల క్రితం చైనా కు చెందిన 118యాప్ ల‌పై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ లో బ్యాన్ చేసిన యాప్ ల‌లో ప‌బ్జీ కూడా ఉంది. యువతను బానిసలుగా చేసుకుంటున్న ఈ యాప్‌ను దక్షిణ కొరియాకుచెందిన బ్లూ హోల్ స్టూడియో రూపొందించింది.

ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఈ ఆట ఆడుతుంటారు. అయితే ఇటీవల భార‌త్‌లో ఈ గేమింగ్ యాప్ నిషేధానికి గురైంది. అయితే ప‌బ్జీ భార‌త్ లో తిరిగి ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. పబ్ జీని తిరిగి ఇండియాలోని వినియోగదారులకు అందించాలని భావిస్తున్న ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ జియో, పబ్ జీ కార్పొరేషన్ తో ఇప్పటికే తీవ్ర కసరత్తులు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఒక‌వేళ డీల్ కుదిరితే.. మ‌ళ్లీ ప‌బ్ జీ ఇండియాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్ప‌టికే చైనా కంపెనీ నుంచి బ్లో హోల్ స్టూడియోస్ దూరం కావడంతో.. ఈ గేమ్ పై ఉన్న క్రేజ్ ను తన సొంతం చేసుకోవాలని జియో రంగంలోకి దిగింది. గేమింగ్ విభాగంలోకి కూడా రావాలని భావిస్తున్న రిలయన్స్.. ఇప్పటికే ఎంతో చొచ్చుకుపోయిన పబ్ జీ అయితే, తొలి అడుగు ఘనంగా వేయవచ్చని అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

పబ్ జీపై ముఖేష్ అంబానీ కన్ను.. మ‌ళ్లీ ఇండియాలోకి రీ ఎంట్రీ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts