క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన ముమైత్ ఖాన్…?!

September 29, 2020 at 4:39 pm

ముమైత్ ఖాన్.. తెలుగు చిత్ర ప్రేక్షకులకు ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ ఇప్పటికింకా నా వయసు 16 ‘ అంటూ పోకిరి సినిమాలో నటించిన ఈవిడ తాజాగా వార్తల్లో నిలిచింది. ఓ క్యాబ్ డ్రైవర్ తాజాగా ఓ హీరోయిన్ నన్ను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్ మహా నగరం నుండి గోవాకు క్యాబ్ మాట్లాడుకుని ఆ తర్వాత కిరాయి డబ్బులు ఇవ్వలేదని సదరు క్యాబ్ డ్రైవర్ తెలియజేశాడు. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాఘవరాజు అనే క్యాబ్ డ్రైవర్ ను నటి ముమైత్ ఖాన్ ను నాలుగు రోజులకు సంబంధించి హైదరాబాద్ నుంచి గోవా కి తీసుకువెళ్లడానికి డ్రైవర్ గా బుక్ చేసుకున్నారట. అయితే కేవలం నాలుగు రోజులు మాత్రమే బుక్ చేసుకున్న ఆవిడ 7 రోజులు తనతోనే తిప్పుకుందని, అలా తిప్పుకున్న కూడా తనకి ఎలాంటి కిరాయి ఇవ్వకుండా చేసిందని డ్రైవర్ వాపోయాడు.

కార్ సంబంధించి కిరాయి ఇవ్వకపోగా, రోడ్డు మధ్యలో వచ్చే టోల్ గేట్ బిల్లులు, అలాగే డీజల్ అన్ని కూడా తానే పెట్టుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ తెలియజేశాడు. చివరికి ముమైత్ ఖాన్ తన అకామిడేషన్ గురించి కూడా క్యాబ్ డ్రైవరే చూసుకున్నట్లు సమాచారం. అయితే వీటి అన్నింటికీ కలిపి డబ్బులు చివరగా ఇస్తుందని అనుకున్న క్యాబ్ డ్రైవర్ కి నిరాశ మిగిలింది. ముమైత్ ఖాన్ సంబంధించి మొత్తం 15 వేల బిల్లు అయిందని క్యాబ్ డ్రైవర్ తెలియజేశాడు. దీంతో ఏం చేయలేకపోయిన క్యాబ్ డ్రైవర్ వారి అసోసియేషన్ తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు అందించాడు. నాలాంటి పరిస్థితి మరో డ్రైవర్ కి ఇలాంటి సంఘటన ఎదురు కాకూడదని రాజు తెలియజేస్తున్నాడు. ఐటం సాంగ్స్ తో ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టిన ముమైత్ ఖాన్ ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ పొట్ట కట్టడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయంపై ముమైత్ ఖాన్ ఇంకా స్పందించలేదు. చూడాలి మరి ముమైత్ ఖాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో.

క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసిన ముమైత్ ఖాన్…?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts