ముంబై, కోల్ కతా పోరు.. వార్ వన్ సైడ్..?

September 23, 2020 at 6:17 pm

క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక మొదటి మ్యాచ్ నుంచి నిన్నటి మ్యాచ్ వరకు అన్ని మ్యాచులు కూడా ఎంతో ఉత్కంఠ భరితమైన ఎంటర్టైన్మెంట్ ను క్రికెట్ ప్రేక్షకులకు అందించాయి. చివరి బాల్ వరకు ఏ జట్టు గెలుస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ఈరోజు ఐపీఎల్ లో రెండు దిగ్గజ జట్లు అయినా కోల్కతా నైట్ రైడర్స్.. ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అనేసరికి క్రికెట్ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ రెండు జట్లు మధ్య గత సీజన్లో ఉన్న గణాంకాలు చూస్తే… రోహిత్ సేనా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పై పూర్తిగా ఆధిపత్యం సాధించింది అని చెప్పాలి. మొత్తంగా ఐపీఎల్లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 25 సార్లు తలపడగా.. పదహారు సార్లు రోహిత్ సేనా ఘన విజయం సాధించింది… ఇక ఆరు సార్లు కోల్కతా విజయం సాధించింది. అత్యధిక పరుగుల విషయంలో వికెట్ల విషయంలో కూడా ముంబై ముందంజలో ఉండటం గమనార్హం. మరి ఈరోజు ఏ జట్టు గెలిస్తుందో అన్నది చూడాలని మరీ.

ముంబై, కోల్ కతా పోరు.. వార్ వన్ సైడ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts