`బాల‌య్య కూడా నా బ్ర‌ద‌రే`.. ఫొటో ఫోస్ట్ చేసిన నాగ‌బాబు!

September 15, 2020 at 10:16 am

మెగా బ్రదర్ నాగబాబు వర్సెస్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు కార‌ణంగా బాల‌య్య‌పై నాగ‌బాబు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడ‌ట‌మే.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు బాలయ్య ఎవరో తెలియదని చెప్పిన నాగబాబు.. ఎప్ప‌టిక‌ప్ప‌డు వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసేవారు. అయితే తాజాగా ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది.

తాజాగా నాగబాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నందమూరి నట సింహం బాలకృష్ణ కలిసి ఉన్న పాత ఫొటోను నాగబాబు అభిమానులతో పంచుకున్నారు. దాని కింద మరింత ఆసక్తికరమైన కామెంట్ కూడా పెట్టాడు. `2 బ్రదర్స్ కమ్ టుగెదర్.. ఒకరు సొంత తమ్ముడు.. మరొకరు బ్రదర్ ఫ్రమ్ అనెదర్ మదర్`అని కామెంట్ జత చేశారు నాగబాబు.

News18 Telugu - పవన్ కళ్యాణ్, బాలయ్య ఫోటోను షేర్ చేసిన నాగబాబు.. | Naga  Babu shared a rare photo of Pawan Kalyan Balakrishna in social media pk-  Telugu News, Today's Latest News in Telugu

అంతేకాదు, ఇంకా తనవద్ద ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయని, ఇది జస్ట్ ‌శాంపిల్ మాత్రమే అని నాగ‌బాబు చెప్పుకొచ్చాడు. అప్పట్లో సుస్వాగతం సినిమా ఓపెనింగ్‌లో బాలయ్య కూడా ఉన్నాడు. దానికి సంబంధించిన ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసాడు నాగబాబు. అయితే గ‌త కొన్ని రోజులుగా బాల‌య్య‌పై నిప్పులు చెరుగుతున్న నాగ‌బాబు.. స‌డెన్‌గా బ్ర‌ద‌రంటూ ఫొటో షేర్ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

`బాల‌య్య కూడా నా బ్ర‌ద‌రే`.. ఫొటో ఫోస్ట్ చేసిన నాగ‌బాబు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts